సూర్యాపేట టౌన్ జనవరి 31: సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ పివిపి కంపెనీ వ్యవస్థాపకులు మీలా సత్యనారాయణ 94 జయంతి వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయ కులు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ లు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ..... ఓ మారుమూల గ్రామం నుంచి సూర్యాపేట పట్టణానికి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన అవిశ్రాంత పారిశ్రామిక వేత్త అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ గా పదవిని ఇచ్చి గౌరవించిందని, ఆయన చైర్మన్ గా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తించారు. నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చకీలం రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.