calender_icon.png 3 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లో పారిశ్రామిక వ్యర్థ జలాలు

02-04-2025 12:10:59 AM

సెప్టిక్ ట్యాంకర్లలో తరలింపు  పట్టించుకోని అధికారులు

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో గల పారిశ్రామిక వాడలోని వ్యర్థ జలాలను సెప్టిక్ ట్యాంక్ వాహనాలలో నింపి ఎవరికి అనుమానం రాకుండా వాగులలో పంట పొలాలలో వదులుతున్నారు. మేడ్చల్ పట్టణ పరిధిలో మల శుద్ధ కేంద్రం  ఉన్నప్పటికీ  ప్రవేట్ కంపెనీ ద్వారా వచ్చే వ్యర్ధ  జలాలను మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పూడూరు గ్రామ పరిధిలో గల శామీర్పేట్ చెరువుకు కలిసే పెద్ద వాగు ప్రక్కన  పంట పొలాలలో వదులుతున్నారు.

ట్యాంకర్ యజమానులు  పారిశ్రామికవాడలో ఉన్న పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను రూ.2000 నుంచి రూ.3000 వరకు క్లీనింగ్ కోసం వసూలు చేస్తు మేడ్చల్ - శామీర్ పేట పెద్ద చెరువు వాగు సమీపంలో ఉన్న ప్రైవేట్ భూములలో వదిలేస్తున్నారు. మండలంలో సుమారు నాలు గు సెప్టిక్ ట్యాంకులు  పారిశ్రామిక వ్యర్థ జలాలతో నిత్యం తిరుగుతూ ఉన్నాయి.  సెప్టిక్ ట్యాంకుల్లో ఉన్నటువంటి వ్యర్ధ పదార్థాలను ఎవరైనా తొలగించుకోవాల్సిందే కానీ ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం రావల్సిన ట్యాంకర్ల నిర్వాహకులు మేడ్చల్ ప్రాంత పారిశ్రామిక వ్యర్థ జలాలను వదిలేస్తున్నారు.

పూడూరు, రాజబో ల్లారం గ్రామ శివారు ప్రాంతా ల్లో ఎక్కువగా జరుగుతుంది. సాగునీటి కాలవలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సెప్టిక్ ట్యాంక్ వాహనాలు నిలిపి వాహనంలో ఉన్న వ్యర్ధ జలాలను వాగుల పక్కన పైపుల ద్వారా వదిలిపెడుతున్నారు. సెప్టిక్ ట్యాంకర్లో ఉన్నటువంటి ఈ పారిశ్రామిక వ్యర్ధాలు వదిలి వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఆ సమయంలో అటువైపుకు వెళ్లే వారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుంది. దుర్గంధమైన వాసన వెద జల్లుతుంది.

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్  కంటే హానికరమైన విషపూరితమైన వ్యర్ధాలను ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ వదిలేసి వెళ్లే వారికి పొలాలలో పోయించుకునే రైతులకు డబ్బులు వస్తుండగా ప్రజలకు రోగాలు వస్తున్నాయి. తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవడమే కాకుండా విషవాయువులు గాలిలో కులుస్తున్నాయి.  ట్రీట్మెంట్ ప్లాంట్ కు తీసుకెళ్లాల్సి ఉండగా ఖర్చు వస్తుందని ఉద్దేశంతో ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు.  సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.