calender_icon.png 15 January, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామికం మందగమనం

13-09-2024 12:35:13 AM

4.8 శాతానికి వృద్ధి రేటు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ పారిశ్రామిక రంగం నత్తనడక కొనసాగిస్తున్నది. ఈ ఏడాది జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.8 శాతానికి మందగించింది. ప్రధానంగా మైనింగ్, తయారీ రంగాల పేలవమైన పనితీరు కారణంగా మొత్తం పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు తగ్గినట్టు గురువారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు జూలైలో పారిశ్రామిక రంగం 6.2 శాతం వృద్ధిచెందింది. 2024 జూలైలో ఇది 4.8 శాతానికి పరిమితమయ్యింది.

ఈ జూలైలో తయారీ రంగం ఉత్పత్తి 4.6 శాతమే వృద్ధి చెందింది. 2023 జూలైలో ఈ వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంది.  మైనింగ్ ఉత్పత్తి వృద్ధిరేటు గణనీయంగా 7.9 శాతం నుంచి 3.7 శాతానికి పడిపోయింది. ఈ ఏప్రిల్ మధ్యకాలంలో పారిశ్రామికోత్పత్తి 5.2 శాతం వృద్ధి సాధించింది. నిరుడు ఇదేకాలంలో 5.1 శాతం వృద్ధిని కనపర్చింది.