దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్సులు పొందిన బ్యాంక్‌లు కొత్త టెక్నాలజీతో, అత్యాధునిక బ్యాంకింగ్ సేవలతో కార్యకలాపాలు ప్రారంభించినవి నవతరం బ్యాంక్‌లుగా ప్రసిద్ధి పొందాయి. ఇప్పటి ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు అప్పుడు లైసెన్సు పొందినవే.
పురాతన నాగరికతల్లో వినూత్న వాణిజ్య, వ్యాపార ప్రక్రియలకు, సాంస్కృతిక సంపదకు పేరొందిన వ్యాలీ సివిలైజేషన్ (సింధు లోయ నాగరికత) ప్రేరణతో హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడు శ్రీచంద్ పి హిందూజా ఇండస్ ఇండ్ బ్యాం క్‌ను నెలకొల్పారు. 30 ఏండ్ల క్రితం 1994 ఏప్రిల్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ను అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.
ప్రారంభ మూలధనం రూ. 100 కోట్లుకాగా, ఇందులో రూ.60 దేశీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 40 కోట్లు ప్రవాస భారతీయుల నుంచి సమీకరించారు. రిటైల్ బ్యాంకింగ్ సర్వీసుల్లో ప్రత్యేకత కలిగిన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు ప్రస్తుతం 4.1 కోట్ల మంది ఖాతాదారులున్నారు.
భారత్ ఫైనాన్షియల్ విలీనం
ఎన్‌బీఎఫ్‌సీ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ను (గతంలో ఎస్‌కేఎస్ ఫైనాన్స్) ఇండస్‌ఇండ్ బ్యాంక్ రూ.15,000 కోట్లకు టేకోవర్ చేసింది. 2019లో బ్యాంక్‌లో భారత్ ఫైనాన్షియల్ విలీనం పూర్తయ్యింది. సం యుక్త ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాల వ్యాపారం చేసేందుకు విక్రమ్ ఆకుల స్థాపించిన ఎస్‌కేఎస్ ఫైనాన్స్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత దానిపేరునే భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్‌గా మార్చారు.
రూ.74,274 లక్షల కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.74,274 కోట్లు. ఆస్తుల్లోనే కాకుండా మార్కెట్ విలువలో సైతం ప్రైవేటు బ్యాంక్‌ల్లో ఐదవ స్థానంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ నిలిచింది. ఈ షేరు గత మూడేండ్లలో 11.5 శాతం మాత్రమే రాబడిని ఇచ్చింది.
3,040 శాఖలు..రూ.5.15 లక్షల కోట్ల ఆస్తులు
ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు 2024 సెప్టెంబర్‌నాటికి దేశవ్యాప్తంగా 3,040 శాఖలు ఉన్నా యి. 3,011 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 మార్చి 31నాటికి ఈ బ్యాంక్‌లో 45,637 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా రు. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆస్తుల పరిమా ణం తాజా గణాంకాల ప్రకారం రూ. 5,14,935 కోట్లు.
ఆస్తుల రీత్యా ప్రైవేటు బ్యాంక్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ల త ర్వాత ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఐ దవ స్థానంలో ఉన్న ది. ఈ బ్యాంక్‌లో 2024 సెప్టెంబర్‌నాటికి హిందూజా గ్రూ ప్‌నకు 74 శాతం వాటా ఉండగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద 9.99 శాతం వాటా ఉన్నది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు ప్రస్తుతం సుమంత్ కాత్పాలియా ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.