calender_icon.png 19 October, 2024 | 6:19 AM

ఇందూరు శిగ మెత్తాలె!

28-07-2024 12:38:03 AM

  1. నిజామాబాద్‌లో నేడే ఊర పండుగ 
  2. భక్తిశ్రద్ధలతో అమ్మవార్ల ఊరేగింపు 
  3. ఏర్పాట్లు పూర్తి చేసిన సర్వసమాజ్ సభ్యులు

నిజామాబాద్, జూలై 26 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరవాసులు ఆదివారం ఘనంగా ఊర పండుగ (పెద్ద పండగ) జరుపుకోనున్నారు. ఏటా జూలైలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల పండుగ జరుపుతున్నప్పుడే ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. భక్తులు పంటలు బాగా పండాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా ఉం డాలని అమ్మవార్లను వేడుకుంటారు. సర్వసమాజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగుతుంది. పండుగ సందర్భంగా భక్తులు 14 మంది గ్రామదేవతలైన సార్గమ్మ  సార్గమ్మ కొండల రాయిడు, బోగంసాని, మహాలక్ష్మి, అంపుడు పోశమ్మ, అసు, రాట్నం, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచ మ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ తల్లి, అడెల్లి పోచ మ్మ, జెండా గుడిల వద్ద కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.

ఏటా నగరంలో బండారు పోసిన తర్వాత, నకాష్ గల్లీలో నకాష్ కళాకారులు మామిడి కర్రతో అమ్మవార్ల విగ్ర హాలను తయారీ చేస్తారు. పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. పండుగ రోజు జైలు కోటలోని శారదాంబదేవి ఆల యం నుంచి ఊరేగింపు ప్రారంభించి నగర వ్యాప్తంగా నిర్వహిస్తారు. అమ్మవార్లను నగరంలోని గురుద్వార మీదుగా పెద్ద బజారు వరకు ఊరేగిస్తారు. పెద్జబజార్ నుంచి దుబ్బా, వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి అనే మూడు మార్గాలుగా ఊరేగింపు విడిపోతుంది. ఇక్కడి నుంచి జెండా మంది ర్, గోల్ హనుమాన్ చౌరస్తా, వినాయక్ నగర్, ఎల్లమ్మగుట్ట, హమాల్‌వాడి, కంఠేశ్వర్, దుబ్బాల మీదుగా వివిధ ప్రాంతాలకు చేరుతుంది. 

దశాబ్దాల నుంచి ..

సర్వసమాజ్‌లో అన్ని కులాల వారు సభ్యులుగా ఉంటారు. దశాబ్దాల క్రితం నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పటి నుంచి ఏటా ఊర పండుగ నిర్వహిస్తున్నామని సర్వసమాజ్ అధ్యక్షుడు, నిజా మాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 90 సంఘాల సభ్యులు సర్వసమాజ్‌లో సభ్యులుగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల పండుగ నిర్వహించే రోజే నిజామాబాద్ నూ ఊర పండగ నిర్వహిస్తామన్నారు.