calender_icon.png 28 September, 2024 | 2:53 AM

‘ఇందు’.. కనువిందు

28-09-2024 12:55:22 AM

హీరో శివకార్తికేయన్ బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, మహేంద్రన్ నిర్మిస్తున్నారు. శివ్‌అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ చాప్టర్ ఆధారంగా రూపొందిందీ సినిమా. ఇందులో సాయిపల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండటంతో ఆమెను ‘ఇందు రెబెక్కా వర్గీస్’గా పరిచయం చేస్తూ మేకర్స్ ఇంట్రో వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు.

ముఖ్యంగా ఈ ఇంట్రో వీడియో ప్రధానంగా సాయిపల్లవి క్యారెక్టర్‌పై ఫోకస్ చేస్తూ కనువిందు చేసింది. ఇందు పాత్రలో సాయిపల్లవి కట్టిపడేసింది. ఇది ముకుంద్, ఇందుల ఎమోషనల్ జర్నీని అద్భుతమైన గ్లింప్స్‌గా ప్రజెంట్ చేస్తోంది. సాయిపల్లవి, శివకార్తికేయన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తుండగా, సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఇదే ఏడాది అక్టోబర్ 31న విడుదల కానుంది.