calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభ

17-04-2025 12:00:00 AM

  1. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా 
  2. సంస్మరణ సభలో పాల్గొననున్న మంత్రి సీతక్క 

ఇంద్రవెల్లి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఈనెల 20వ తేదీన నిర్వహించే సభను విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. 1981లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు నివాళ్లు అర్పించేందుకు ఏప్రిల్ 20న నిర్వహించే ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను, అమరుల స్మృతి వనం నిర్మాణ పనులను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ నేతలతో కలిసి బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భం గా అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. స్మృతి వనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆదివాసీలకు  ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి చర్య లు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, చైర్మన్ నాగోరావ్, పలువురు అధికారులు, ఆదివాసి సంఘాల నేతలు పాల్గొన్నారు.