calender_icon.png 23 April, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రారెడ్డి సేవలు మరువలేని

23-04-2025 12:49:38 AM

- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి 

చేవెళ్ల , ఏప్రిల్ 22 : మాజీ హోం శాఖ మంత్రి పట్లొళ్ల ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రారెడ్డి 25 వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మండల పరిధి స్వగ్రామం కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నివాళుర్పించారు.

అంతకు ముందుకు ఇంద్రారెడ్డి నగర్, చిట్టంపల్లి గేట్ వద్ద ఉన్న ఇంద్రారెడ్డి విగ్రహాలకు నివాళుర్పించారు. అనంతరం నాంచేరు గ్రామ రెవెన్యూలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రారెడ్డి చిత్రపటానికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ కెరటం, తెలంగాణ ఉద్యమంలో కీల పాత్ర పోషించిన ఇంద్రారెడ్డి సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిచిపోయాయని అన్నారు.

ఆయన దూరమై 25 సంవత్సరాలు గడిచినా ప్రజల అభిమానం, ప్రేమ, ఆప్యాయత ంద్రారెడ్డి, మాపై ఉండడం సంతోషకరమై సందర్భమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లొళ్ల కార్తీక్రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్, బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కెప్టెన్ అంజన్ గౌడ్, చేవెళ్ల, శంకర్పల్లి బీఆర్‌ఎస్ మడలాల అధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్, గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బాల్ రాజ్, కౌకుంట్ల, అంతారం మాజీ సర్పంచ్లు సులోచన, గాయత్రి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమల్ల ఆంజనేయులు, నాయకులు శేఖర్ రెడ్డి, హన్మంత్రెడ్డి, కొల్లగల్ల భాస్కర్, శేరి రాజు, సుదర్శన్ నాయకులు పాల్గొన్నారు.