calender_icon.png 24 September, 2024 | 3:45 PM

ఇంటి వాస్తుకు ఇండోర్ ప్లాంట్స్

24-09-2024 12:00:00 AM

ప్రస్తుతం ప్రకృతి ప్రియులు.. ఇండోర్ ప్లాంట్స్ పెంచడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇవి ఇంట్లో ఉంటే ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది.  పచ్చదనంతో ప్రశాంతమైన వాతావరణాన్ని  కల్పిస్తాయి. అపార్ట్‌మెంట్ కల్చర్ పెరగడంతో ఇంటి ముందు మొక్కలు పెంచడానికి స్థలం లేనివారు హాల్, బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటున్నారు. వీటివల్ల మానసిక ప్రశాంతతో పాటు వాస్తు కూడా కలిసి వస్తుంది.

  మనీ ప్లాంట్

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను పెంచుకుంటే పేరుకు తగ్గట్లే ఇంట్లోకి సిరి సంపదలు అందిస్తుందట. ఇంట్లో చిన్న పూల కుండీలను కొనుగోలు చేసి వాటిలో పూల మొక్కలు నాటడం మంచిది. వీటి వల్ల అందంతో పాటు వాస్తు కూడా కలిసి వస్తుంది.

డ్రాకేనా

 ఇంట్లో కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటే మొక్కల్లో డ్రాకేనా కూడా ఒకటి. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, తెలుపు, పసుపు గులాబీ రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా కొన్ని రకాల డ్రాకేనా మొక్కలు మచ్చలు లేదా చారలను కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. వీటిని చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

కలబంద

కలబంద మొక్క చాలామంది ఇళ్లలో కనువిందు చేస్తుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనికి ఎక్కువగా నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి  చర్మానికి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.