calender_icon.png 10 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో ఇండోర్, మినీ స్టేడియం

08-01-2025 12:47:12 AM

  • మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తాం
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మహదేవ్‌పూర్, జనవరి 7: కాటారం మండల కేంద్రంలో త్వరలోనే ఇండోర్, మినీ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సాహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కాటారం మండల కేంద్రంలో కాటారం డివిజన్ 19 ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ట్రస్మా అధ్యక్షుడు కొట్టే శ్రీశైలం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏర్పాటుచేసిన క్రీడా పోటీ  విజేతలకు మంగళవారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాటారంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, క్రీడా రంగాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి పూనుకుందన్నారు. కాటారం మండల కేంద్రానికి మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని చెప్పారు.

మినీ స్టేడియం కోసం ఇప్పటికే భూసేకరణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అంతకుముందు కొయ్యూరు మండల కేంద్రంలో 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు, అంగన్వాడీ సూపర్  ఎలక్ట్రిక్ స్కూటీలను  పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మంథని డివిజన్ యూత్ అధ్యక్షుడు సందీప్‌తదితరులు పాల్గొన్నారు.