calender_icon.png 25 December, 2024 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిపబ్లిక్ డే ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో

05-11-2024 12:56:06 AM

న్యూఢిల్లీ, నవంబర్ 4: ప్రతి గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథులను ఆహ్వానించే సంప్రదాయం భారత్‌లో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా జనవరి 26న జరుగనున్న వేడుకలకు ముఖ్యఅతిథిగా కేంద్ర ప్రభుత్వం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నట్లు సమాచారం.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. భారత్ ఇండోనేషియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు ఈ పరిణామంతో స్పష్టమవుతున్నది. ఇండోనేషియా ప్రభుత్వం కూడా భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఆ ఒప్పందం సాకారమైతే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా నిలవనున్నది. 1950లో జరిగిన మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకులకు నాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఈసారి వేడుకులకు ఇప్పటి అధ్యక్షుడు ప్రబోవో హాజరవుతున్నారు. ఈ సారి పరేడ్‌లో ఆ దేశపు సైనిక దళం కూడా పాలుపంచుకోనున్నది.