calender_icon.png 3 April, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రాట్ ప్రాజెక్ట్ సాంకేతిక పనులను సందర్శించిన ఇండోజర్మనీ బృందం

22-03-2025 01:01:19 AM

కోనరావుపేట, మార్చి 21: జర్మనీ ఫెడరల్ ఆహార,వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఫ్రౌన్హోఫర్ హెయిన్రిచ్ హరట్జ్ ఇన్స్టిట్యూట్ (హెచ్‌హెచ్‌ఐ) బృందం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్హబ్ బృందం కలిసి తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మంగళ్లపల్లి , మామిడిపల్లి, రామయ్యపేట, శ్రీరాములపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ( ఎఫ్ పి ఓ )కి చెందిన రైతుల పొలాలను సందర్శించారు.

ఈ సందర్శన ద్వారా అక్రాట్ ప్రాజెక్టు కింద రైతులు ఆమోదిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పొందడం,ఆ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా రైతులు పొందుతున్న లాభాలను సమీక్షించడం లక్ష్యంగా పరిశీలన చేపట్టారు.

ఫెడరల్ మంత్రిత్వ శాఖ ఆసియా విభాగం ప్రధానిగా పనిచేస్తున్న మిస్. రిబెక్కా రిడ్డర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలులోకి వస్తున్నందుకు రైతులు, స్టార్టప్స్, శాస్త్రవేత్తలు, బ్యాంకుల మధ్య ఉన్న సమన్వయం కీలకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రౌన్హోఫర్ హెచ్ హెచ్ ఐ  నుండి డాక్టర్ సెబాస్టియన్ మరియు డాక్టర్ రఘు చలిగంటి ప్రాజెక్టు పురోగతిపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

నాబార్డ్ డీజీఎం హైదరాబాద్ శ్రీకాంత్ పై ప్రాజెక్టు గురించి ప్రశంసలు వ్యక్తం చేశారు.ఈ బృందంలో పీజేటఏయు పరిశోధన డైరెక్టర్ డాక్టర్ బాలరామ్, అగ్హబ్ సీఈఓ విజయ్ నడిమింటి, అక్రాట్ ప్రాజెక్టు మేనేజర్ ముకేశ్ రామగోని, సేవ్స్  కృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాబార్డ్ కరీంనగర్ డిడియం జయప్రకాష్, దిలీప్, పి జె టి ఏ యు  శాస్త్రవేత్తలు, ఎఫ్ పి వో ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.