calender_icon.png 25 December, 2024 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల బరిలో ఇండో అమెరికన్స్

06-11-2024 12:34:34 AM

  1. పోటీ చేస్తున్న తొమ్మిది మంది
  2. తొలిసారి పోటీలో నలుగురు అభ్యర్థులు

వాషింగ్టన్, నవంబర్ 5: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్ ప్రతినిధుల సభకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన కొంతమంది భారతీయుల్లో తొమ్మిది మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడుతున్నారు. వారిలో ఐదుగురు ఇండో అమెరికన్లు మరోసారి బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 1. వర్జీనియాలోని 10 కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సుహాస్ సుబ్రమణ్యం(38) పోటీలో ఉన్నారు. ఇక్కడ  అధిక సంఖ్యలో ఇండియన్స్ రూట్స్ ఉన్నవారు ఉండడంతో ఆయన గెలిచే అవకాశాలు ఎ క్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆయన గెలిస్తే ఈ  రాష్ట్రం నుంచి గెలిచిన తొలి ఇండో నిలవనున్నారు. గతంలో బరాక్ ఒబామాకు సుహాస్ వైట్‌హౌస్‌లో సహాయకుడిగా పనిచేశారు.

2. డాక్టర్ అమిబెరా(59) మరోసారి కాలిఫోర్నియాలోని 6వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో నిలిచారు. 2013 నుంచి అమి ఇక్కడ గెలుపొందుతూ వస్తున్నారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

3. డెమాక్రటిక్ పార్టీలో బలమైన నేతగా ఉన్న ప్రమీలా జయపాల్(59) వాషింగ్టన్ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి పోటీలో ఉన్నారు. 2017 నుంచి ప్రమీలా ఈ స్థానంలో విజయం సాధిస్తున్నారు.

4.రాజా కృష్ణమూర్తి ఇలినాయిస్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. 2017 నుంచి ఆయన ఇక్కడ గెలుపొందుతూ వస్తున్నారు. 

5. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన గత ఏడేళ్ల నుంచి విజయం సాధిస్తున్నారు. 

6. మిషిగాన్‌లోని13 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీతానేదార్ బరిలో ఉన్నారు. ఇల్లినాయిస్, కాలిఫోర్నియా, మిషిగాన్ మూడు రాష్ట్రాల్లో డెమోక్రాట్లకు పట్టు ఉంది. 

7.డాక్ట్ అమిష్ షా అరిజోనా తొలి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఉంచి పోటీలో ఉన్నారు. అరిజోనా స్టేట్ అసెంబ్లీలో వరుసగా 2018,20,22 సంవత్సరాల్లో విజయం సాధించారు.

8. డాక్టర్ ప్రశాంత్‌రెడ్డి కాన్సాస్ 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. 

9. డాక్టర్ రాకేశ్ మోహన్ న్యూజెర్సీ 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడుతున్నారు. కాగా ప్రశాంత్‌రెడ్డి, మోహన్ గెలిచే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

గతంలో..

కాగా 1957లో దలీప్‌సింగ్ సంధూ కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి తొలిసారి గెలిపొంది అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన తొలి ఇండో అమెరికన్‌గా నిలిచారు. మొత్తం మూడుసార్లు ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తరువాత 2005లో లూసియానా నుంచి బాబీ  జిందాల్ గెలిచారు.  అనంతరం రెండుసార్లు లూసియానాకు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు.