calender_icon.png 11 March, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగాలి

11-03-2025 12:09:47 AM

రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి

యాదాద్రి భువనగిరి, మార్చి 10 (విజయక్రాంతి) ః ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ  ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని  రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్ లో ఆర్డీవోలకు, ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, మండల ప్రత్యేక అధికారులకు, ఎంపికైన గ్రామాల పంచాయతి సెక్రెటరి లకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రెవిన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే  ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు.

గ్రామాలలో ఎంపికైన ఇండ్ల కు మార్కింగ్ ను వేగవంతం గా పూర్తి చేయాలని ఎంపికైన గ్రామాల పంచాయతి సెక్రెటరి లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని అన్నారు. మిగిలిన అన్ని గ్రామాలలో ని ఇండ్ల కు సంబదించిన వెరిఫికేషన్ ప్రక్రియ ను పూర్తి నివేదిక సమర్పించాలని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ . శోభారాణి,రెవిన్యూ డివిజనల్ అధికారులు,  కృష్ణారెడ్డి, డి.ఆర్.డి.వో, నాగిరెడ్డి ,  శేఖర్ రెడ్డి , హౌసింగ్ పీడీ విజయసింగ్, హౌసింగ్ డిప్యూటీ ఈ ఈ. టి. నాగేశ్వర రావు, ఎం. శ్రీ రాములు అధికారులు పాల్గొన్నారు.