calender_icon.png 30 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు

30-04-2025 12:00:00 AM

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ.  

అచ్చంపేట ఏప్రిల్ 29: ఏలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అయ్యాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులను గుర్తించామని మరికొన్ని చోట్ల గృహ నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. అందుకు ఉచితంగా ఇసుకను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎంపికలో ఎటువంటి అవినీతి అక్రమాలకు పైరవీలకు తావు లేకుండా ఎంపిక చేయడం నిర్మించడం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు.