17-03-2025 12:17:37 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కామారెడ్డి, మార్చి 16(విజయ క్రాంతి), ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదలందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
అనంతరం సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర ల దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు, అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ మండల, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.