calender_icon.png 17 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

17-03-2025 01:45:43 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి, మార్చి 16 (విజయక్రాం తి): గ్రామాలలో అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.తలకొండపల్లి మండలంలోని తన స్వగ్రామమైన  ఖానాపూర్ గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు మండలానికి ఒక గ్రామాన్ని  పైలెట్ ప్రాజెక్టు కింది ఎంపికచేసింది.అందులో  భాగంగా ఖానాపూర్ గ్రామాన్ని ఎంపికచేసి గ్రామాలో అర్హులైన వారందరికి ఇల్లు మజూరు చేశారు.అర్హులైన కొందరికి ఇల్లు మజూరు కాకపోవడంతో ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.స్పందించిన ఎమ్మెల్యే అర్హులైన అందరికి ఇల్లు మంజూరు చెయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఇల్లు మంజూరైన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్తాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే నిదులను దశలవారిగా విడుదల చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిదంగా నియొజవర్గంలోని మాడ్గుల,చారకొండ,ఆమనగల్ మండలాల్లోని ఆయాగ్రామాలకు చెందిన సిఎం సహాయనిది లబ్దిదారులకు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.