calender_icon.png 19 November, 2024 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరిక నిర్మూలనకు ఇందిరమ్మ విశేష కృషి

19-11-2024 01:00:14 PM

చేర్యాల (విజయక్రాంతి): దేశంలో పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అన్నారు. కొమురవెల్లిలోని పోలీస్ బొమ్మ వద్ద ఇందిరా గాంధీ జయంతిని నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా గరీబి హటావో, ఆరు సూత్రాల పథకం, వెట్టి చాకిరి విముక్తి, సీలింగ్ చట్టం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

దేశానికి స్థిర పాలన, పూర్తి దాయకమైన పరిపాలన అందించిందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ స్ఫూర్తితోనే పరిపాలన కొనసాగుతుందన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు గృహజ్యోతి, ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ లాంటి పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ఆమెకు మనమిచ్చే ఘనమైన నివాళులు అని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి కనకరాజు, బత్తిని నరసింహులు, సార్ల లింగం, బుడిగే ఐలేని, ఎక్కల దేవి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.