calender_icon.png 19 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచాలి

04-04-2025 12:56:39 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల  గ్రౌండింగ్ లో వేగం పెంచి సకాలం లో పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై  సంబంధిత అధికారులతో  సమీక్ష నిర్వహించారు.

ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాలలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, గ్రౌండ్ అయిన ఇండ్లు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పైలెట్ గ్రామాలలో మంజూరు చేసిన 1023 ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని,ఏప్రిల్ 7 వరకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో మార్కింగ్ పూర్తి కావాలని, బేస్మెంట్ లెవెల్ లో పూర్తి చేసిన వారికి త్వరగా పేమెంట్ చేస్తామని అన్నారు.  సమావేశంలో ఇన్చార్జి ఆర్.డి.ఓ. రాధభాయి, పి.డి. హౌసింగ్ శంకర్, డి.ఈ.లు ఏ.ఈ.లు, పంచాయితీ సెక్రటరీలు,  పాల్గొన్నారు.