08-04-2025 12:00:00 AM
కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరిధిలోని ఆయా మండలాలలో ఎంపిక చేసిన గ్రామాలలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, రెండు పడక గదుల ఇళ్ల పురోగతి పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లాలోని ఆయా మండలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ఎంత వరకు వచ్చాయి, బేస్మెంట్ దశకు ఎన్ని వచ్చాయి.
ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా,తదితర వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక కూపన్లు అధికారులు అందజేయాలని,నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వారంలో మూడు రోజులు అధికారులు పర్యవేక్షించి, బేస్మెంట్ వరకు వచ్చిన వాటికి బిల్లుల చెల్లింపునకు పంపాలని లబ్ధిదారులుగా ఉన్న పురుషుల కుటుంబాలకు చెందిన వాటిలో రేషన్ కార్డులో ఉన్న మహిళ పేరును ఖరారు చేస్తూ జాబితా ను సమర్పించాలని అదేవిధంగా యూడిఐడి కార్డులు, చేయూత పెన్షన్లపై అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, హౌసింగ్ అధికారి రవీందర్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస రావు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.