calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

19-03-2025 12:56:27 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. మార్చి 18(విజయక్రాంతి) : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ హౌసింగ్, డి ఆర్ డి ఏ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీ వో, మున్సి పల్ శాఖల అధికారులతో ఆయా శాఖల ప్రగతి పనుల పై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో ఇంత వరకు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయని అడిగారు. స్పందించిన హౌసింగ్ పీడీ శంకర్ ఇప్పటి వరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లా 6 వ స్థానంలో ఉందని తెలిపారు.

మిగతా ఇండ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనప కలెక్టర్ సంచిత్ గ్యాంగ్ వార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డిఈ వో గోవిందరాజులు, జి సి డి ఓ నర్మదా, డిపిఓ సుధాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ భోగేశ్వరులు పాల్గొన్నారు.