బిఆర్ఎస్ మండల నాయకులు పెంచాల మధు...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని భూమి లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని బిఆర్ఎస్ మండల నాయకులు పెంచాల మధు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలి కుటుంబానికి, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలన్నారు. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఆత్మీయ భరోసా అందే లాగా జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. జాబ్ కార్డు ఉన్న వారిలో 20 పనిదినాలు పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు.