సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి తప్పులు దొరలకుండా వివరాలు నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సర్వే సిబ్బందికి సూచించారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్వహిస్తున్న సర్వే తీరును స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల వివరాలను పూర్తిగా యాప్ లో నమోదు చేయాలని ఏలాంటి తప్పిదం లేకుండా సర్వే పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రజలు సైతం సర్వేకు వచ్చే అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.