26-03-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఇందిరమ్మ మాడల్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ మాడల్ హౌసింగ్ సైట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ నీరు అందని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పాసిగాంలో ఇందిరమ్మ మాడల్ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ నిర్వహణ ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల క్రమబద్దీకరణ పథకం లక్ష్యాన్ని ఈ నెల 31వ తేదీలోగా 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్ష పతి, డి.ఈ వేణుగోపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.