calender_icon.png 5 February, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ మోడల్ హౌజ్‌ను వెంటనే నిర్మించాలి

05-02-2025 12:39:04 AM

తాడ్వాయి, జనవరి, 4 (విజయ క్రాంతి ): ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను వెంటనే నిర్మించాలని స్థానిక సంస్థల అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మంగళవారం ఆయన అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కోసం స్థలాన్ని పరిశీలించారు.

ఈ మోడల్ హౌస్ ప్రజలకు అర్థమయ్యేలా నిర్మించాలని అధికారులకు సూచించారు మోడల్ హౌస్‌ను ప్రభుత్వం అందించే నిధులతో ఎలా నిర్మించుకోవాలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన కోరారు  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ తాసిల్దార్ రహీముద్దీన్ అధికారులు పాల్గొన్నారు.