calender_icon.png 6 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

17-01-2025 04:33:29 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గొల్లపల్లి, సులానగర్, ముత్యాలపాడు క్రాస్ రోడ్డు, కోయగూడెం, టేకులపల్లి గ్రామాలలో జరుగుచున్న ఇందిరమ్మ ఇండ్ల సూపర్ చెక్ సర్వే ప్రక్రియ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే, రేషన్ కార్డుల సర్వే, ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)/ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి  విద్యా చందన శుక్రవారం పరిశీలించినారు. కోయగుడెం గ్రామంలో రైతు పకీర మునగతోటను పరిశీలించినారు, సులానగర్, ముత్యాలపాడు x రోడ్డు గ్రామాలలో నర్సరీలను పరిశీలించినారు. అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టేకులపల్లి మండల పరిషత్ ఉపాధి హామీ కార్యాలయాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డేటా ఎంట్రీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గడదాసు రవీంద్రా రావు, అదనపు కార్యక్రమాల అధికారి కాలంగి శ్రీనివాస్, కార్యదర్శులు సిద్ధాంత చిట్టి, పవిత్ర, శ్వేత, ఉపాధి హామీ సిబ్బంది తిరుపతయ్య, భీముడు, స్వప్న బాలాజీ, ధనలక్ష్మి, లకన్, సాగర్, సరిత తదితరులు పాల్గొన్నారు.