calender_icon.png 19 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాలలో ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభం

05-04-2025 12:00:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, ఏప్రిల్ 4 : బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో శుక్ర వారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ లాంచనంగా ప్రారంభించారు. బెల్లంపల్లి మండలంలో కన్నాల గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ గ్రామంలో ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన దోనేటి లావణ్య, రాజమౌళి దంపతుల ఇంటికి మొదటిసారిగా ఎమ్మెల్యే వినోద్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల ప్రజలు ఆనం దం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పా రు.

పేదలకు అందించే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని చెప్పారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో మహేందర్, ఎంపీఓ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారుకూరి రామ్ చందర్, టి పీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నూతన స్వామి, మండల పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ జాలి మహేష్, కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్ దూడెం మహేష్ తదితరులు పాల్గొన్నారు.