calender_icon.png 16 April, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల

16-04-2025 01:54:29 AM

  1. బేస్‌మెంట్ పూర్తిచేసుకున్న 2,019 మంది
  2. 12 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించిన సీఎం రేవంత్‌రెడ్డి
  3. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఖాతాల్లో జమ: మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): బేస్‌మెంట్ పూర్తిచేసుకున్న ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.20.19కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొ దటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద మం జూరు చేసిన 70,122ఇండ్లలో బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి లక్షరూపాయలు చొప్పున వారి ఖాతాలో జమచేసిం ది.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 12 మంది లబ్ధ్దిదారులకు మంగళవారం రూ.లక్ష చొప్పున చెక్కులు అంద జేశారు.  ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకం కలుగకుండా నిధులు విడుదల చేస్తామని, ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం సూచించారు.

రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 13,500 ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి అయిందన్నారు. మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు.

బేస్‌మెంట్ పూర్తయితే లక్షరూపాయలు, గోడలు పూర్తయితే రూ.1.25 లక్షలు, శ్లాబ్ పూర్తయితే రూ. 1.75లక్షలు, ఇల్లు పూర్తయితే మిగిలిన రూ.లక్ష విడుదల చేస్తామని తెలిపారు. బేస్‌మెంట్, గోడలు, శ్లాబ్ నిర్మాణం పూర్తయితే అధికారుల కోసం ఎదురుచూడకుండా లబ్ధిదారులే ఫొటో తీసి మొబైల్‌యాప్‌లో అప్‌లోడ్ చేసినా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు.

కనీసం 400ఎస్‌ఎఫ్‌టీకి తగ్గకుం డా 600ఎస్‌ఎఫ్‌టీకి మించకుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయడం, అధికారులకు, ప్రజాప్ర తినిధులకు మధ్య సమన్వయం ఉండేలా ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు