calender_icon.png 29 April, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

26-04-2025 12:29:05 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బిచ్కుంద, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రం లోని కే.జయశ్రీ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు.

తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించు కుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న షెడ్ లో నివసిస్తున్నామని, తన కున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఇతర సిబ్బంది ఉన్నారు.