కామారెడ్డి (విజయక్రాంతి): దివ్యాంగులందరికీ ఉండడానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోలా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. వికలాంగులలో కొందరికి కాళ్లు లేవని, మరికొందరికి చేతులు, కొందరు గుడ్డివారని, మరి కొందరు చెవిటి వారిని ఇలాంటి వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మంజూరు చేయాలని కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరామన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, షేక్ హుస్సేన్, ఉడుత శిగ్రాములు, డప్పు రాజునర్సు, భానపురం సాయిలు, సుజాత, ఎండి మోయిజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.