జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాల అర్బన్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని కోరుతూ మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అడిషనల్ కలెక్టర్ లతకు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీల పథకాలు అమలులో భాగంగా ప్రజాపాలన క్రింద ఆరులైన వారి నుండి దరాఖాస్తులను స్వీకరించారని, కానీ వివిధ పథకాలకు అరులైన చాలామంది లబ్ధిదారుల పేర్లు ఆన్లున్లో నమోదు కాకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, టిఆర్‌ఎస్ జగిత్యాల రూరల్, అర్బన్, రాయికల్ పట్టణం రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్’రావు, తుమ్మ గంగాధర్, అనిల్, మల్లేష్, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు పాల్గొన్నారు.