28-03-2025 12:00:00 AM
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్ రెడ్డి
నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి) : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తిప్పర్తి తహసీల్లార్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని, రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించి రోజు రూ.600 వేతనం చెల్లంచాలన్నారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నన్నూరు వెంకటరమణారెడ్డి, మండల కార్యదర్శి మన్నె భిక్షం, మండల నాయకులు పాల్గొన్నారు.