28-04-2025 02:11:02 PM
జుక్కల్,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇండ్ల(Indiramma houses)ను నిర్మించుకోవాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్(Jukkal MPDO Srinivas) అన్నారు. సోమవారం ఆయన మండలంలోని హంగార్గ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన చేశారు. అర్హులైన వారు కార్యకర్త స్థలాలు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 400 నుంచి 600 వరకు స్క్వేర్ ఫీట్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
కట్టుకుంటామని అనుకున్న వారికి మాత్రమే తమ హౌసింగ్ అధికారులు వచ్చి ఇంటి ముగ్గును వేసి ఇస్తారని చెప్పారు. ఇల్లు కట్టుకునేవారు అక్కడ ఫోటోలు దిగాల్సి ఉంటుందని దానికి సరిగ్గా మ్యాచ్ అయితేనే ఇందిర మ్మ ఇండ్లకు బిల్లులు వస్తాయని పేర్కొన్నారు. 600 స్క్వేర్ ఫీట్ల కంటే ఒక్క ఎంచు ఎక్కువగా కట్టిన ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదని గుర్తు చేశారు. లబ్ధిదారులు ముందుగానే ఆలోచించి నిర్ణయించుకోవాలని సూచించారు. పాత కట్టుకున్న ఇండ్లకు ఎలాంటి బిల్లులు రావని ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేయవద్దని అధికారులకు సూచించారు. ఆ విధంగా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి అశోక్ గౌడ్, వివో ఏ రాజు, జి పి సిబ్బంది బసవరాజ్ పటేల్ తదితరులు ఉన్నారు.