calender_icon.png 29 April, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

26-04-2025 12:31:16 AM

కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట

కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్25(విజయ క్రాంతి) : నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల ను అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యే విజయరామారావు లు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్,  ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నమూనాను మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం  ఆవరణలో నిర్మించామని, మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేసే  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం గురించి అవసరమైన సలహాలు మేస్త్రి లకు జిల్లా లోని నాక్ సెంటర్  ద్వారా   పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నామని  అన్నారు.  మొదటి విడతలో సోంత జాగా ఉండి సొంత ఇల్లు లేని అత్యంత నిరుపేదలకు, కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.   అన్నారు.  కార్యక్రమంలో  ఆర్డీఓ బి.గంగయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్  రాజేశ్వర్, తహసీల్దార్, ఎంపీడీఓ., ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.