19-04-2025 12:38:55 AM
కల్లూరు, ఏప్రిల్ 18:-మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఎమ్మెల్యే రాగమయి నేత్రుత్వంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన కార్యాచరణ అమలు జరుగుతోంది.మంజూరైనా ఇళ్ల గురించి ఇందిరమ్మ కమిటీలు విచారిస్తున్నాయి. కాగా మండలంలోని కల్లూరు కు 50 ఇందిరమ్మ ఇళ్ళు, బత్తులపల్లి కి 20 ఇళ్ళు మంజూరు కాగా చండ్రు పట్లకు 30 ఇండ్లు, చెన్నూరు 35, చిన్నకోరుకోండి 40, కప్పలబంధం 20, కిష్టయ్య బంజర 10, కొర్లగూడెం 15, లక్ష్మీపురం 15, లింగాల 20, లోకవరం ఈస్ట్ 57, లోకవరం వెస్ట్ 15, మర్లపాడు తెలగారం 15, ము చ్చారం 20, ముగ్గు వెంకటాపురం 18, నారాయణపురం 20, ఓబుళరావు బంజర10, పాయ వనర్ 15, పెద్ద కోరుకోండి 25, పేరువంచ 30 ఇళ్ళు మంజూరయ్యాయి. పోచారం 15, పుల్లయ్య బంజర 20, రఘునాద్న 20, తాళ్ళురు వెంకటాపురం 20, వియన్ తండ 15, వెన్నవల్లి 20, యజ్ఞనారాయణపురం 15 ఇళ్ళు మంజూరైనట్లు అధి కారులు తెలిపారు.