calender_icon.png 27 November, 2024 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి నుంచి ఇందిరమ్మ ఇళ్లు

21-10-2024 01:33:28 AM

  1. దోచుకు తిని ధర్నాలు చేస్తారా?
  2. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం 
  3. మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరు
  4. రైతుల సంక్షేమానికి 50 వేల కోట్లు ఖర్చు
  5. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, అక్టోబర్ 20 (విజయక్రాంతి):  దీపావళి నుంచి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రూపాయి రూపాయి పోగు చేసి,పేదల కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

ఆదివారం ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో సీసీ రోడ్లుకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల కోసం దాదాపు రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.  

బీఆర్‌ఎస్ హయాంలో వ్యవస్ధలన్నీ నాశనం..  

పదేండ్లపాటు వ్యవస్థలను నాశనం చేసి, ఆర్థిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేసి,రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. దోచుకుని ధర్నాలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.చేసిందంతా చేసి కాం గ్రెస్ ప్రభుత్వంపైన, సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డా రు.

బీఆర్‌ఎస్ ఎగ్గొట్టిన రైతు బంధును కూడా కాంగ్రెస్ అ ధికారంలోకి రాగానే ఇచ్చామని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వారికి ప్రజలే త గిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ధర్నా లు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. శ్రీరంగ నీతులు చెబుతూ మొసలి కన్నీరు కారుస్తూ రోడ్డు ఎక్కితే ప్రజలు నమ్మరని విమర్శించారు.   

ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టడానికి బీఆర్‌ఎస్సే కారణమని   అన్నా రు. అ ప్పులు తీర్చుకుంటూనే  ప్రజల అవసరాలు తీరుస్తున్నామని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ  ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతున్నానమని తుమ్మల చెప్పారు.

 వరద బాధితులకు న్యాయం చేస్తాం 

మున్నేరు వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక కారణాలతో వల్లనే కొంత మందికి పరిహారం అందడంలో ఇ బ్బంది ఏర్పడిందని, వాటిని సరి చేసి వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తుమ్మల చెప్పారు.

విలీన పంచాయతీ ల్లో మౌలిక వసతుల కల్పనకు ఇటీవల వచ్చిన రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని తెలిపారు. కొత్త కాలనీలకు ప్రాధాన్యత ఇ వ్వాలని కమిషనర్‌కు చెప్పామని తెలిపారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసేదాకా తాను విశ్రమించనని ఆయన చెప్పారు.