పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, నవంబర్ 23 (విజయక్రాంతి): రహదారి విస్తరణలో భాగంగా నష్టపోతున్న బాధితులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఆబ్కారి, పర్యాటక, సాంస్కృత్రిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలో శనివారం రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేశారు.
అదేవిధంగా రూ.20 లక్షల నిధులతో గ్రామంలో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్ర భవానానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ.. నష్టపోయిన వారికి ప్రభుత్వపరంగా సహాయం చేసేలా కృషి చేస్తానన్నారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.