calender_icon.png 27 December, 2024 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి కానుకగా పేదలకు శుభవార్త

26-12-2024 08:37:48 PM

ఖమ్మం,(విజయక్రాంతి): సంక్రాంతి కానుకగా అర్హులైన కుటుంబాలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దమ్మపేట మండలం నాచారంలో 40 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు.

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండేలా మొదటి దశలో పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తామని, ఎక్కువ అవసరాల దృష్ట్యా షెడ్యూల్డ్ తెగల రిజర్వ్‌డ్ ప్రాంతాలకు అదనపు కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

గృహ నిర్మాణ ప్రకటనతో పాటు దమ్మపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. అలాగే కార్యాలయంలోని రికార్డుల పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవల గురించి ఇన్ చార్జి ఎమ్మార్వోని అడిగి, రికార్డులో పొందుపరిచిన వివరాలను చూసి నేరుగా బాధితులకు అందుతున్న సేవల గురించి ఫోన్ ద్వారా మంత్రి తెలుసుకున్నారు. కేశవప్పగూడెం, ములకపల్లిలో కొత్త హైలెవల్ వంతెనలకు శంకుస్థాపన చేశారు. రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన కుటుంబాలను ఆదుకోవడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.