calender_icon.png 11 March, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

11-03-2025 12:55:44 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, మార్చ్ 10 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ టౌన్ దిల్వార్పూర్ మామడ మండలాల్లో పర్యటించి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

నిర్మల్ పట్టణంలో 280 మందికి దిల్వార్పులో 32 మందికి చెక్కులు అందించి మాడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారుల ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ ఆర్డిఓ రత్న కళ్యాణి తాసిల్దార్ సంతోష్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ ఎంపీపీ పద్మ రమేష్ పార్టీ నాయకులు రమణారెడ్డి సాదమ్ అరవింద్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.