calender_icon.png 30 April, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

29-04-2025 12:18:03 AM

ఇంచార్జి అధికారి సోమేశ్వరరావు    

కొండాపూర్, ఏప్రిల్ 28 :ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో సోమవారం నియోజకవర్గం ఇంచార్జీ సోమేశ్వర్ రావు, ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి అనంతసాగర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులుఉన్నారు.