28-04-2025 12:39:51 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 27 (విజయ క్రాంతి) : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని బుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలో భాగంగా ఆదివారం వార్డ్ నెంబర్ 37 లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అ ర్హులైన వారిని ఎంపిక చేసారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్ మహబూబ్ నగర్ జిల్లా ము డా చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ స్వప్న లక్ష్మణ్ యాదవ్,వార్డ్ ఆఫీసర్, ఆర్‌పిలు, నాయకులు రాజు మామ,శ్రీను,సతీష్, ఖదీర్, నాచ శ్రీనివాస్ యాదవ్,శామ్యూల్ దా సరి,చక్రధర్,పులిజాల రవి కిరణ్, ఖాజా,షబ్బీర్,అంజి, తదితరులు పాల్గొన్నారు.