25-04-2025 12:00:00 AM
అర్హులైన వారికి సత్వరమే డ్వాక్రా రుణాలు మంజూరు
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
సిర్పూర్ యు, ఏప్రిల్ 24(విజయ క్రాం తి): నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరు గుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువా రం లింగాపూర్ మండలం జూలంధార గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వర గా ప్రారంభించాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సొంత ఇంటికాలను సహకారం చేసుకోవాలని తెలిపారు. డ్వాక్రా మహిళా లబ్ధిదారు లకు రుణాల మంజూరుకు పరిశీలన ప్రక్రి య పూర్తి చేయాలని, అర్హులైన వారికి సత్వరమే రుణాలు మంజూరు జరిగే విధంగా ఐ.కె.పి. ఎ.పి.ఎం.కు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆర్థిక చేయుతనందించి ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ క్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంత రం గ్రామంలోని త్రాగునీటి వనరులను పరిశీలించారు. వేసవికాలం అయినందున ప్రజ లకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
తాగునీటి సమస్య లేకుండా చర్యలు
వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్యలు లేకుండా నిరంతరం నీటిని అం దించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం సిర్పూర్- యు మండల కేంద్రంలోని పంపు హౌస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా అవస రమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలలో నీటి ట్యాంకు లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీటివి అందిం చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నిరుపేదలకు గుడు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎంపికైన అర్హత గల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని తెలిపారు. అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీ ణ నీటి సరఫరా మండల ఎ.ఈ., సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.