calender_icon.png 19 April, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

18-04-2025 12:03:31 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, ఏప్రిల్ 17 : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చెప్పారు. గురువారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహిం చిన  ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సన్నాహక సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. 

ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు.  ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కానొద్దని అర్హులందరికీ ఇండ్లు వచ్చేలా చూస్తా మని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, ఎంపీడీ వోలు హిమబిందు, వెంకయ్యగౌడ్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్,  ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్రెడ్డి, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.