calender_icon.png 17 April, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు

16-04-2025 12:00:00 AM

 జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. ఏప్రిల్ 15(విజయక్రాంతి) : అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నియోజక వర్గానికి ఓ ప్రత్యేక అధికారినీ  నియమించడం జరుగుతుందని, ఆ  ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలనీ ,అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటట్లు చూడాలన్నా రు.

నియోజకవర్గానికి కేటాయించిన 3500  ఇందిరమ్మ ఇండ్లను అర్హులందరికీ వచ్చేలా అధికారులు  తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.అనంతరం  భూ భారతి పై అధికారులతో కలెక్టర్ చర్చించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ఆర్. డి. ఓ. రాంచందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.