calender_icon.png 19 April, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

10-04-2025 12:00:00 AM

ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్

మందమర్రి, ఏప్రిల్ 9: నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంతఇంటి కళను నెరవేరుస్తామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశా రు. మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించి మాట్లాడారు.

మండలంలో తొలి విడత పైల ట్ ప్రాజెక్టుగా ఎంపికైన పొన్నారంలో ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిర్మించ డం జరుగుతుందని, అర్హులందరూ ఇందిరమ్మ ఇంటి పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు. నిరుపేదలందరికీ  నాణ్యమైన నివాసగృహాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను గ్రామంలోని సమస్యలను అడిగి తెలు సుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్ తహసీల్దార్ సతీష్ కుమార్, జిల్లా హౌసింగ్ పిడి బన్సిలాల్, కాంగ్రెస్ నాయకులు గందే రాంచందర్, మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, కొట్టే సంపత్ కుమార్ పటేల్, కడారి జీవన్ కుమార్, బేర సమ్మయ్య, కాపురపు సతీష్, భూషణం, రవి, అనిల్, పోచయ్య, రాములు పాల్గొన్నారు.