పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఆదిలాబాద్, జనవరి 06 (విజయ క్రాంతి) : అరులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా రాష్ర్ట ప్రభుతం చర్యలు తీసుకుంటున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి సీతక్క అన్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి ఆధర్యంలో నెలకొల్పిన క్యాంటీన్‌ను ప్రారంభించారు.
ఆదిలాబాద్‌లో బీటీ రోడ్డు, మురికి కాలువల, బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మావల మండలంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్లు, దుబ్బగూడలో పీహెచ్‌సీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్స్ కోసం క్లినిక్‌ను ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు.
జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించి, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌష్ ఆలం, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ ఉత్సవాల్లో సీతక్క
నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్స సోమవారం రాత్రి మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా చరిత్రను తెలిపేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్‌లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు పాల్గొన్నారు.