calender_icon.png 30 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు

30-10-2024 01:25:01 AM

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): దీపావళి కానుకగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండ లం గోల్‌తండాలోని శ్రీభాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

నవంబర్ 1, 2వ తేదీల్లో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మొద టి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కేటాయిస్తామన్నారు. తర్వాత విడతల వారీగా అర్హులైన ప్రతి  నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా రైతులకు ఎంతో నష్టం వాటిల్లిందని, కొనుగోళ్లు పక్కా గా చేపట్టి రైతులకు న్యాయం చేయాలన్నా రు. రైతు సంక్షేమం కోసం  తమ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రుణమాఫీ  చేశామన్నారు. డిసెంబర్‌లోపు మరో రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. సన్నరకం ధాన్యానికి సర్కార్ బోనస్ అదనంగా ఇస్తున్నామ న్నారు.

అంతకు ముందు మంత్రి బీరోలు చెరువు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబా బు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత పాల్గొన్నారు.