06-03-2025 12:00:00 AM
మేస్త్రీల శిక్షణ తరగతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్, మార్చ్ 5 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడానికే మేస్త్రీ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా మేస్త్రీ లకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేస్త్రీ లకు కిట్ లను పంపిణీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు కట్టడం లో మేస్త్రీల ప్రాముఖ్యత చాలా ముఖ్యం ఆన్నారు.
గత సోమవారం నుండి మూడు రోజుల పాటు ఇస్తున్న శిక్షణలో మార్కౌట్ , ఇటుక కు సంబంధించి, తదితర వాటిపై న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆన్నారు. 17 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించి ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రీ ల సహకారం తో కంప్లీట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ, ఎంపిడిఒ లు, పంచాయితి సెక్రటరీ లు, తదితరులు పాల్గొన్నారు.