calender_icon.png 23 February, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలి

19-02-2025 03:09:33 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses)కు ఎంపికై, మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh ​​Surabhi) విజ్ఞప్తి చేశారు. బుధవారం శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండల పరిధిలోని ఈర్లదిన్నె గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. నాగసాని పల్లిలో 156 మంది లబ్ధిదారులు గ్రామ సభ ద్వారా  ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక కాగా, ఈర్లదిన్నె గ్రామంలో 72 మంది  లబ్ధిదారులు గ్రామ సభ ద్వారా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై పలు సూచనలు చేశారు.