calender_icon.png 19 April, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం ఆధ్వర్యంలో సమస్యల అధ్యయన యాత్ర

12-04-2025 03:19:36 PM

పైలట్ గ్రామమైన పూబెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలన

ఇల్లెందు,(విజయక్రాంతి): సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా సీపీఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి సర్వే కార్యక్రమన్ని నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూబెల్లి, సుందరయ్య నగర్, నెహ్రు నగర్, రైటర్ బస్తీ, ఇల్లందుల పాడులో అడిగి తెలుసుకున్నారు. దానిలో భాగంగా మండలంలో పైలట్  గ్రామంగా ప్రకటించిన పూబెల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను సీపీఎం మండల బృందం వెళ్లి పరిశీలించింది. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఆరు గ్యారంటీల అమలు తీరుపై అధ్యయనం నిర్వహిస్తున్నామని, ఆ క్రమలోనే పూబెల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. 

ఆ గ్రామంలో మొత్తం 80 మందిని అర్హులుగా గుర్తించ్చారని, గ్రామాన్ని పైలట్ గ్రామంగా ప్రకటించి నిర్మాణం చేయడం అభినందనీయం అన్నారు. అదే తరహాలో ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కేటాయింపులు సరిపోవని, పునాదుల నిర్మాణానికే 50వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని కాబట్టి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఆవాజ్ యోజన పథకాన్ని జోడించి రూ.15లక్షలు వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు రెక్కడితే కానీ డొక్కాడిని పరిస్థితి ఉందని కావున నిర్మాణంకు ముందే సగం బిల్లులను చెల్లించాలని కోరారు. అధ్యయన యాత్ర లో వెళ్ళడైనా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ అధ్యయన యాత్ర లో తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేష్, కొడెం బోస్, అబ్బాస్, నాగరాజు, మమత, సోమ కృష్ణ, ఆడెపు కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.